Panchakosha-Nirasana

సద్గురు పరబ్రహ్మణే నమః


పంచకోశ నిరసన
ఎలా నిరసిస్తున్నాం?
అన్నమయ కోశాన్ని నువ్వుకాదని ఎలా నిరసిస్తావు?
శి. ఎదైనా విచారణ ఇప్పుడు ఏదైతే మూడే మూడు విషయాలు తీసుకుంటున్నామండీ!
1.       ఏదైతే నాకు తెలియబడుతుందో అది నేను కాదు.  Okay నాకు తెలియబడుతంది వేరుగా వున్నాను నేను. విషయము నేను కాదు, విషయిని. అది నాకు తెలియబడుతుంది కాబట్టి అది నేను కాదు.
2.    Okay జరగవలసినది ఏదో అది జరుగుతున్నది, ప్రారబ్దవశమున అది అనుభవించ వలసినది అది అనుభవిస్తున్నది, లేకపోతే ఎవరి దగ్గరనుంచన్నా ఏదన్నా వచ్చింది. అది స్థూల శరీరానికే కదా! నేను ఆత్మస్వరూపుడిని కదా! నాకు సంబంధించింది కాదు కదా! అని చెప్పేసి పట్టీ పట్టనట్టు వుంటున్నాం.
3.    అనారోగ్యం వచ్చింది, దేహం ప్రారబ్దవశాన అనుభవించ వలసి వచ్చింది అనుభవిస్తున్నది, అనుభవించనివ్వండి. అని చెప్పేసి అలా చూస్తూ ఊరుకుంటున్నాం, భరిస్తున్నాం.

అది అన్నమయకోశంకు వచ్చేప్పటికి అట్లా వుంటుంది. మానసిక భావాలకు వచ్చేటప్పటికి కూడా అదే విధంగా చూస్తున్నాం. ఆలోచనలు తెలియబడుతున్నాయి, వాసనానుభవం కోశం ఆలోచనల రూపంలోకి వస్తున్నాయి. అది శరీరం ద్వారా క్రియారూపంలోకి వస్తుంది. వాసనానుభవం అనుభవించ బడుతున్నది. ఆ విధంగా వాసనలు రద్దయిపోతాయి, ఖర్చయిపోతాయి. అయిపోనియ్యి అని చెప్పేసి అట్లా, పట్టించుకోకుండా వుండగలుగుతున్నాం.

అది ఎంతవరకు correct? అనుభవపూర్వకంగా ఎట్లా చూడాలి? ఏ దృష్టితో చూడాలి? అనేది, చెప్పించుకుందామనేసి మీతో.

ఇక్కడొక అంశముంది బాబూ!
ఊఁ.. చెప్పండి.
అన్నమయ కోశాన్ని నిరసించడం అంటే అర్థం ఏమిటంటే?
అన్నమయ కోశానికి అసలు ఏమున్నాయి?
బాల్య యవ్వన కౌమార వృద్ధాప్యములు వున్నాయి.
అవును.
ఈ నాలుగు అవస్థలలోనూ దేహం పొందుతున్న పరిణామాన్ని అన్నమయకోశ పరిణామముగా చెప్పారు.
అవును.
ఈ నాలుగు అవస్థలు అసలు దేహానికా? మనసుకా?
ఏదైనా గ్రహించేది మనసు ద్వారానే కదా!
కానీ, దేహం పరిణామం చెందినట్లు కనబడుతోందిగా?
పరిణామం చెందుతోంది, అవును.
బాల్య యవ్వన కౌమార వృద్ధాప్యాలుగా పరిణామం చెందుతున్నట్లు దేహం కనబడుతోందా లేదా?
కనబడుతోంది.
కాబట్టి, దేహానికి,  దేహంలో జరుగుతున్న మార్పులన్నీ కూడాను ఇప్పుడు ఎలా చూడాలట?
ఆ నాలుగు అవస్థలలో పరిణామం చెందుతున్న దేహం నేను కాదని వుండాలి.
అవును.
ప్రాణమయ కోశం నువ్వు కాదని ఎలా అంటావ్‌?
            దాంట్లో విచారించవలసిన అవసరం కనబడలేదు పెద్దగా, అది సహజంగా జరుగుతుంది కాబట్టి, దాంట్లో నేను అనేది తాదాత్య్మత వుండదు కాబట్టి, ఏమీ అనిపించలేదు. విచారణ చేయవలసిన అవసరం కనిపించలేదు.
ఊఁ... అసలు ప్రాణమయకోశం వల్ల నీకు ఏర్పడుతున్నవి ఏమిటి అసలు?
ఆకలి దప్పులు. 
అంతేనా? ఇంకేమన్నా ఏర్పడుతున్నాయా?
దానితో తాదాత్మ్యత చెందితే, చెందేది దీనితో తప్ప, ఆకలి దప్పుల తప్పించి మిగితా ఏమీ, అహంకారం interfere అవ్వాల్సిన అవసరమేమీ లేదు కదా!
క్షుత్‌ పిపాసలు, ఆలస్యము, నిద్ర, తమసాదులు.
తమోగుణంఅసలు దేని వల్ల ఏర్పడుతుందంట?
            అవిద్యా ప్రభావం అంటారు.
కదా!
ఇప్పుడు, అవిద్యకు స్థానం నీలో ఎక్కడుంది? ఏ కోశంలో వుంది?
            కారణ శరీరం.
ఏ కోశంలో వుంది?
            ఆనందమయ కోశం.
అవిద్య అన్నమయమా? ప్రాణమయమా? మనోమయమా?
            ఆనందమయం.
ఆనందమయంలో అన్నావే అనుకో!
అప్పుడు, సచ్చిదానందంలోని ఆనందం ఏ గుణానికి సంబంధించినది అవుతుంది?
తమోగుణానికి సంబంధించినది అవుతుంది.
కానీ, అవ్వటం లేదుగా అప్పుడు.
            అవును.
ఎందుకనీ, సచ్చిదానందమనేది చైతన్య స్థితి కదా!
            చైతన్యం వచ్చేసి చిత్‌ ఒకటే కదా, దాంట్లో?
చిత్, చిత్‌జడం. చిత్‌కు జడశక్తి కలిసిందనుకో, అప్పుడు తమగుణం అయ్యింది. కేవలం చిత్‌ శక్తి, చిత్‌ శక్తిగానే వున్నప్పుడు చైతన్యమే అయివున్నది. కాబట్టి జడశక్తి, చైతన్య శక్తి ఈ రెండు ఎక్కడెక్కడైతే కలిసి పనిచేస్తున్నాయో, అక్కడ జడశక్తి యొక్క ప్రభావం బలంగా వున్నప్పుడు, తమోగుణం ప్రధానమయ్యింది. అదే చైతన్యశక్తి గనుక ప్రధానంగా గనుక వున్నట్లయితే సత్వగుణంగానీ, రజోగుణంగానీ ప్రధానంగా వున్నాయి. కాబట్టి ప్రతీచర్య, ప్రతిచర్యలలో కూడా ఈ జడ చేతన విమర్శ ముందు చేయాలి. పంచకోశ నిరసన చేయాలి అంటే, ముందు జడచేతన విమర్శ చేయాలి. కాబట్టి,

అన్నమయ కోశం జడంలోకి వస్తుందా? చేతనం లోకి వస్తుందా?
            జడంలోకే వస్తుంది.
తప్పని సరిగా జడంలోకే రావాలి.
            అవును. వేరే మార్గం లేదు.
ప్రాణమయకోశం మరి?
            ప్రాణమయకోశం కూడా జడం క్రిందకే.
అంటే, ప్రాణమయ కోశాన్ని పూర్తి జడంగా లెక్కవేయగలుగుతున్నామా?
            అవును, ఇప్పుడు నిద్రావస్థ, గాఢసుషుప్తిలో వుంది. కానీ, దాని మూలంగా ఏమీ తెలియబడటం లేదు కదా!
అంటే, ప్రాణమయ కోశము స్వేచ్ఛగా పనిచేస్తుందా? యాంత్రికముగా పనిచేస్తుందా?
            ఆ రెండిటికి భేదం ఏంటి?
అంటే, స్వేచ్ఛగా పనిచేస్తే నీకు విచక్షణా జ్ఞానము, నిర్ణయించగలిగే శక్తి వుంటాయి.
(ప్రాణమయకోశానికి) స్వేచ్ఛ లేదనుకో, అప్పుడేమి చేయాలి?         
మరొకరో లేక మరొక కోశమో చెప్పినట్లు వినాల్సిందే.
            అంటే, శ్వాసను మనం స్వాధీనం చేసుకుంటే స్వేచ్ఛలో వున్నట్లా?
 అట్లా ఆలోచించకూడదు నువ్వు.
అసలు ముందు జీవులలో, ఈ ప్రపంచంలోని అందరి మానవులలో ఈ ప్రాణమయ కోశం ఎట్లా పని చేస్తుంది? యాంత్రికంగా పనిచేస్తుందా? స్వేచ్ఛగా పనిచేస్తుందా?
            స్వేచ్ఛగానే పనిచేస్తుంది.
ఎందువల్ల?
            శరీరమే నేనుగా వున్నాడు కాబట్టి, ప్రాణాన్ని గుర్తించే దశలోనే లేడు కాబట్టి, ప్రాణం స్వేచ్ఛగా వున్నట్లు కనబడుతోంది.
            అవును.
అదే ప్రాణాన్ని గుర్తించే కొద్దీ ఏం తెలిసింది?
            ప్రాణం ఒక క్రమపద్ధతిలో శరీరం అంతా వ్యాపిస్తున్నది, అన్ని క్రియలు నిర్వహిస్తున్నది. అంతటితో దాని పని పూర్తైపోతున్నది.

అంటే, శరీరంలో వున్న క్రియాశక్తి స్వరూపం ఎవరు ఇప్పుడు?
            ప్రాణశక్తి.
            ప్రాణశక్తి.
క్రియాశక్తికి స్వేచ్ఛ వుందా?
క్రియ ఎప్పుడూ కర్త మీద ఆధరాపడుతుంది కదా!
కాబట్టి, స్వేచ్ఛ లేదు.
లేదు.
అంటే ఒకే చైతన్యము, మనలో ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, ఆదిశక్తి, పరాశక్తి అని ఐదు వ్యవహారాలు నిర్వహిస్తోంది.
            ఊఁహూ..
కాబట్టి, ఈ ఐదు వ్యవహారాలు కూడాను, స్థూలంలో వున్నాయా? సూక్ష్మంలో వున్నాయా? కారణంలో వున్నాయా?
            సూక్ష్మమే. ఏ శక్తి అయినా సూక్ష్మము, శక్తైనప్పుడు సూక్ష్మమే కదా!
శక్తి పరిధి అంటే సూక్ష్మమే అయివున్నది.
            అవును.
కానీ ఆదిశక్తి, పరాశక్తి అనేవి ఈ శక్తిగా వ్యవహరించడానికి వ్యవహరించే శక్తులు కావవి. అవి కారణ శక్తులు. కాబట్టి ఆదిశక్తి, పరాశక్తినేమో కారణ శరీరంలోనూ, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తులేమో సూక్ష్మశరీరంలోనూ వున్నాయి.
            ఊఁ..హూ..
అయితే, జడశక్తి ఎలా ఉత్పన్నమైంది? ఎందకని?
            జడశక్తి పదార్థాన్ని ఆశ్రయించి వుంది.
            అవును.
ఏ శక్తి మొట్టమొదట పదార్థంగా add అయినప్పుడు, అప్పుడు నీకది జడశక్తిగా మార్పుచెందింది?
            అంతేకదా! మరి, ఎందుకంటే, ఇచ్ఛా, క్రియా, జ్ఞానశక్తులే వ్యవహరించాలి పదార్థంతోటి. ఆదిశక్తి పరాశక్తులు వ్యవహరించవు.
అటువంటప్పుడు, ఇచ్ఛా క్రియా జ్ఞాన శక్తులలో ఏది పదార్థంతో కలిసి వ్యవహరించే టటువంటి దశలో వున్నది?
            క్రియాశక్తియే.
ఎందుకని?
పదార్థానికి అతి దగ్గరగా వుందని.
కార్యరూపం దాల్చగలిగేది immediate గా అదే.
అతి దగ్గరగా వుంది. కాబట్టి, క్రియాశక్తి తమోగుణం చెందినప్పుడు పదార్థం అయ్యింది. అదే క్రియాశక్తి రజోగుణాన్ని, సత్వగుణాన్ని పొందియున్నప్పుడు ప్రాణశక్తిగా పనిచేస్తుంది.
ప్రాణశక్తిలో కూడా సత్వగుణం ఎలా చెప్పగలుగుతాము? రజోగుణమే కదా ప్రాణశక్తి?
అంటే ఎట్లా అంటే, మూడుగుణాలలోనూ కదలికలున్నాయి. కదిలికలు లేకుండా లేవుగా మూడు గుణాలలో. తమోగుణంలోనేమో తీవ్రంగా వున్నాయి. రజోగుణంలో నేమో స్వసుఖం – స్వార్థంతోటి వున్నాయి. సత్వగుణంలోనేమో త్యాగంతో వున్నాయి. మూడుచోట్లా కదలికలు, స్పందనలు వున్నాయి. అయితే ఈ మార్పులు ఇచ్ఛాశక్తిలో వున్నాయి కానీ, క్రియాశక్తిలో లేవు. ఇచ్ఛాశక్తి తమోగుణాన్ని ఆశ్రయించినప్పుడు తీవ్రరూపం దాల్చింది, అప్పుడు సహజంగానే క్రియాశక్తి కూడా ఏమైంది? తమోగుణాన్నే ధరించింది.
కాబట్టి ఇప్పుడు, క్రియాశక్తికి స్వేచ్ఛ వున్నదా? గుణ ప్రేరణలో?
            లేదు.
అంటే ఇచ్ఛాశక్తి యొక్క గుణాలను అనుసరించి క్రియాశక్తి పనిచేయవలసినదే కానీ, వేరే రకంగా తనుకు తాను నిర్ణయించుకుని ప్రయత్నం చేయగలిగేటటువంటి సామర్థ్యం క్రియాశక్తిలో లేదు.
            ఆఁ.. హా!
            కానీ, క్రియాశక్తిని control చేయడం ద్వారా ఒక్కొక్కసారి ఇచ్ఛాశక్తిని స్వాధీనం చేసుకోగలుగుతున్నాము కదా!
క్రియాశక్తిని ఎప్పుడూ ఎవరూ ఏదీ control చేయడమూ, చేయకపోవడమూ అనేది లేదు ఎక్కడ. ఎలా అంటే,
(ఉఛ్వాస నిశ్వాసల్నీ....)
విను, control చేయకూడదు దానిని. దాన్ని గమనించమన్నారు.
ఆఁ.. హా!
క్రియాశక్తిని ఏం చేయాలంటే ఎప్పుడూ కూడా గమనించాలి.
గమనించడానికి, control చేయడానికి తేడా ఏమిటి?
Control చేయాలి అంటే నువ్వు దానిమీదే దృష్టి పెట్టి, దాని గతిని మార్చాలి.
            అవును.
అదే గమనించడం అంటే ఎట్లాగో గమనిస్తావు అంతే,
            సాక్షివుండటం, చూస్తూ వుండటమే.
అంతవరకే.
            Okay Okay.
కాబట్టి జ్ఞానశక్తి ప్రధానంగా వున్నవాడేమో సాక్షిగా చూస్తున్నాడు. ఇచ్ఛాశక్తి ప్రధానంగా వున్నవాడేమో, దానిని control చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు.
            ఇచ్ఛాశక్తి మనసుదా? జ్ఞానశక్తి బుద్ధిదా?
అంతే కదా! మరి.
            ఎందుకంటే, మనసు రజోగుణంతో కూడుకుని వుంటుంది. స్వార్థం సుఖం అక్కడ ప్రధానంగా వుంటాయి. కాబట్టి ప్రతి క్రియలోనూ తనకు సుఖం వుండాలని ఆశిస్తాడు.
            మనసు only execute చేసే instrument కదా? దాని మళ్ళా స్వార్థము....
అట్లా కాదు, నువ్వు నిరసించేటప్పుడు ఒక్కొక్కదాన్ని నిరసించేస్తే గానీ నువ్వు మిగలవు. విచారణ చేసేటప్పడు ఏం చేస్తావంటే, మొత్తంగా తెలుసుకున్నావు. అర్థమైందా?
            Okay.
మీ ఇంట్లోకి వస్తువులన్నీ ఒకే సారి కొన్నావా? ఒక్కొక్కటీ కొన్నావా?
ఒక్కొక్కటీ తీసుకుంటాం.
ఇల్లు ఎక్కడికన్నా shift చేసినప్పుడు ఏం చేయాలి?
            ఒకేసారి తీసుకువస్తాం.
మొత్తం తీసేయాలి. అలాగే నిరసించేటప్పుడు అన్నిటినీ సమగ్రంగా పరిశీలిస్తూ, నిరసించుకుంటూ వెళ్ళాలి. అన్నికోణాలలోనే నిరసించాలి దానిని. అప్పుడే అది వ్యవహార శూన్యం అవుతుంది. లేకపోతే అవ్వదన్నమాట. అర్థమైందా?
            కాబట్టి విచారణ చేసేటప్పుడు ఎలా తెలుసుకున్నావు? పంచకోశములు దాని వ్యవహారాన్ని స్థూలంగా తెలుసుకున్నావు.
            అవును.
            అవి నీలో ఎలా వ్యవహరిస్తున్నాయో ఆచరణాత్మకంగా పనిచేస్తున్నప్పుడు గమనించావు.
            అవును.
ఇప్పుడు నిరసించ పూనినప్పుడు ఎట్లా తెలుసుకోవాలి అంటే?
సమిష్టి విధానాన్ని ఆశ్రయించి వ్యష్టిని నిరసించాలి.
ఇప్పుడు ఇచ్ఛా క్రియా జ్ఞాన శక్తులు ఆదిశక్తి పరాశక్తి అనేవి సమిష్టా? వ్యష్టా?
            సమిష్టి శక్తులు.
సమిష్టిగా వున్నటు వంటిది, వ్యష్టిలో కూడా అణుస్వరూపంగా పనిచేస్తున్నాయి. సర్వజీవుల యందు వున్నాయి. నీలో కూడా వున్నాయి.

కాబట్టి, సృష్టి ఏర్పడినటువంటి సిద్ధాంతాన్ని అనుసరించి తీసుకున్నప్పుడు ఏమైంది?
సమిష్టి సిద్ధాంతమును అనుసరించిన వాడివి అవుతున్నావు.
తద్వారా ఏం చేయగలుగుతావు?
            నీలో ఒక్కడిలోనే ఇలా లేదు, ప్రపంచమంతా కూడా వున్నది. దీంట్లో ఏది ప్రశాంతంగా స్వీకరించాలి అని, నిర్ణయం తీసుకున్నప్పుడు నిన్ను సమిష్టికి సాక్షిని చేయగలిగే శక్తి దేంట్లో వుందో దానిని స్వీకరించాలి.
            ఎందుకని?
సాక్షి అంటే సమిష్టి వ్యష్టి భేదం లేదుగా అక్కడ.
            అవును.
కాబట్టి అటువంటి ప్రాధాన్యత కలిగిన విధానాన్ని స్వీకరిస్తావు అప్పుడు. అలా చేసేటప్పుడు,
అప్పుడు క్రియాశక్తి ఏ గుణానికి లోబడినట్లు కనబడింది?
క్రియాశక్తి అనేది ఇచ్ఛాశక్తికి లోబడినట్లు కనబడుతోంది.
కాబట్టి తనకు తాను స్వేచ్ఛ లేదుగా?
            లేదు.
తనకు తాను నిర్ణయించుకోలేదుగా?
            లేదు.
తనకు తాను వ్యవహారాన్ని ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలి అని గతిని మార్చలేదుగా?
            మార్చలేదు.
కాబట్టి, జడం అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు.
            ఏదైతే కదలలేదో, తనకు తాను ఏదైతే నిర్ణయింపబడలేదో, మరొకదాని ఇచ్ఛమేరకు స్వాధీనమై నడుస్తుందో అదే కదా జడమంటే.
            అవును.
కాబట్టి, క్రియాశక్తి ఇప్పుడు ఎందులో పనిచేస్తుంది?
            ప్రాణమయకోశంలో పనిచేస్తుంది.
ఆ ప్రాణకోశం ఇప్పుడు జడ ప్రాధాన్యం కలిగిందా? లేకపోతే చైతన్య ప్రాధాన్యం కలిగిందా?
            జడ ప్రాధాన్యం కలిగింది.
అయితే చేతన శక్తి కూడా వుంది.
            అవును.
90% జడ శక్తిగా వున్నది, 10% చేతన శక్తిగా వున్నది. ఆ 10% చేతన శక్తి ప్రభావం వల్లనే, సర్వేంద్రియాలని నడిపించగలుగుతోంది. అంతే కదా!
            అవును.
దేహధర్మంగా చూచినా కూడా, సృష్టి, స్థితి, లయ, ఆకర్షణ, విస్తీర్ణము అనే అయిదు క్రియలు జరుగుతున్నాయా? లేదా?
            జరుగుతున్నాయి.
అవి ఎవరి ప్రభావం వలన జరుగుతున్నాయి? ఇప్పుడు. ఈ దేహంలో వున్న సర్వేంద్రియాలకి, శక్తిని పంచుతున్నది ఎవరయ్యా? అని అంటే,
            ఈ ప్రాణశక్తిలో వున్న 10 శాతము చేతన శక్తి పంచుతోంది.
జడశక్తి ప్రధానంగా వున్నటువంటి ప్రాణశక్తి, పంచ ప్రాణాలుగా, పంచ ఉపప్రాణాలుగా సంలీన, విలీనాలను యాంత్రికంగా చేస్తుంది.
            అంటే సంస్కారాలను ఏర్పరచాలన్నా, వాసనలను మిగల్చాలన్నా, జ్ఞాపకాలు మూట కట్టాలన్నా, ఈ 10% ప్రాణశక్తితో కూడిన చేతన శక్తి అవసరం.
            Okay.
కాబట్టి, ఈ పదిశాతం ప్రాణశక్తిని, ఇచ్ఛాశక్తితో సమన్వయ పరచగలినప్పుడు ఏమైంది?
            ఇచ్ఛాశక్తితో సమన్వయ పరచడం అంటే?
అంటే ఏమిటంటే? క్రియాశక్తితో పనిచేసేటప్పుడు ఎప్పుడూ కూడా ఏమి కోరుతూ వుంటుంది?
            దాని వాసనలు తీర్చుకోవాలని ప్రయత్నిస్తుంది. ఇంద్రియాల ద్వారా తన కోరికలని..
కోరికలు ఎప్పుడూ కూడా ఇచ్ఛాశక్తిలో కదా వుండేది?
            అవును.
క్రియాశక్తిలో ఏముంది?
            కార్యరూపం ధరించే శక్తి. ధరింపచేయగల శక్తి.
మొదట, ఎప్పుడూ అది సమతుల్యంగా వుండాలి.
            అవును.
ప్రాణం బాలేదు అంటారండీ, అందరూ కూడా... అంతేనా?
            అవును.
ప్రాణం బాలేదు అంటే అర్థం ఏమిటి?
Disturbance వచ్చింది ప్రాణశక్తిలో అని.
ఆరోగ్యంగా వున్నప్పుడు, ప్రాణ అపానములు సమానంగా జరుగుతాయి. అవి రెండూ సమంగా జరిగితే మిగిలిన మూడూ సమంగా జరుగుతాయి. ఆ రెండిటి మీద ఆధారపడే మిగిలిన మూడూ పనిచేస్తాయి. కాబట్టి, ఈ పంచప్రాణాలు ప్రధానంగా పనిచేస్తున్నాయి. పంచ ఉప ప్రాణాలు సంలీన విలీనాలు జరపడం వలన దేహం బాల్య యవ్వన కౌమార వృద్ధాప్యాలను పొందుతుంది.
            Okay.
ఇది సృష్టి ధర్మంగా జరుగుతోంది.
ఎప్పుడైతే ప్రాణాపాన వ్యవహారములో సమతుల్యతలో తేడా వచ్చిందో, అప్పుడేమైంది?
అనారోగ్యం వచ్చింది. ఆ ఆనారోగ్యం వల్ల జీవ ధార్మిక క్రియలు వేగం పుంజుకున్నాయి. కృశించిపోయే లక్షణం పెరిగిపోయింది. వృద్ధి చెందే లక్షణం తగ్గిపోయింది. కాబట్టి,
క్రియాశక్తి యొక్క అసమతౌల్యతలో నీకు ఏమైంది?
దుఃఖం ఏర్పడింది.
ఇచ్ఛాశక్తిలోనేమో ఏం కోరుకున్నావు?
            సుఖాన్ని కోరుకున్నావు.
            అవును.
ఎందుకని?
            అది రాజసిక ధర్మం కాబట్టి.
            అవును.
అదే క్రియాశక్తినూ పదార్థంలోని జడశక్తీనూ ఏమైంది? తమోగుణ ప్రధానంగా వుండడం వల్ల, అవి తీవ్రమైన వేగంతో పనిచేయడం వల్ల, వాటికి ఎప్పుడూ ఏమి వస్తున్నాయి?
            అసమతౌల్యత ఏర్పడి దుఃఖం ఏర్పడుతుంది.
            అవును.
కాబట్టి సుఖానికి ఇచ్ఛాశక్తిలో వున్న రజోగుణం కారణమైతే, ప్రాణమయకోశం అన్నమయకోశంలో వున్నటువంటి తామసిక వ్యవహారం ఏదైతే వుందో, ఆ తామసిక వ్యవహారం అంతా దుఃఖాన్ని తయారు చేస్తుంది. ఈ రకంగా మానవుడికి సుఖదుఃఖాలు ఏర్పడుతున్నాయి.

ఇప్పుడీ సుఖ దుఃఖాలని, ఇచ్ఛాశక్తి విచారణ చేసి నిర్ణయం చేయగలుగుతుందా?
చేయలేదు.
ఏది చేయాలి మరీ?
            జ్ఞానశక్తి. 
            (జ్ఞానశక్తి) చెయ్యాలి.
కాబట్టి అప్పడు దేనిని ఆశ్రయించాలి మనం?
బుద్ధిని ఆశ్రయించాలి.
బుద్ధి ఇప్పుడు ఏం చేసింది?
            సుఖదుఃఖ విచారణ చేసింది.
చేసి ఏం చెప్పింది?
            బుద్ధి సుఖదుఃఖ విచారణ చేసి ఎప్పుడూ సుఖం కావాలనే కోరుకుంటుంది, బుద్ధికూడా.
అప్పుడు ఏ గుణానికి లోబడింది? అప్పుడు ఏ గుణానికి లోబడింది బుద్ధి కూడా?
            రజోగుణానికి లోబడింది.
కానీ బుద్ధి ఎప్పుడూ ఏ స్థితిలో వుండాలి? విచారణ చేయాలంటే?
            సాత్వికముగా వుండాలి.
అప్పుడు విచారణలో దేనికి ప్రాధాన్యతను ఇచ్చింది?
            రజోగుణానికి ప్రాధాన్యతను ఇచ్చింది.
సత్వగుణానికి ప్రాధాన్యత ఇచ్చి పనిచేసే బుద్ధి, విచారణ చేసేటప్పుడు దేనికి ప్రాధాన్యత ఇచ్చింది?
            రజోగుణానికి ప్రాధాన్యతను ఇచ్చింది.
రజోగుణానికి ప్రాధాన్యత ఇస్తే మళ్ళా క్రిందకే దిగి వచ్చేస్తుంది.
            క్రిందకి దిగి వస్తుంది అవును.
కాబట్టి రజోగుణ ప్రధానం కాకుండా చూసుకోవాలి బుద్ధిని ఎప్పుడూ కూడా.
            Okay.
అంటే ఇప్పుడు మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం ఎలా వుండాలి?
            మనోమయ కోశం ఎప్పుడూ కూడా రజోగుణ ప్రధానంగానే పనిచేస్తుంది.
అదే విజ్ఞానమయకోశం ఎట్లా పనిచేయాలి?
            సత్వగుణ ప్రధానంగా పనిచేయాలి.
కానీ, విజ్ఞానమయ కోశం అనేది మనోమయ కోశం చెప్పిన మాట విన్నదనుకోండి, అప్పుడు ఏమయ్యింది?
            రజోగుణానికి లోబడతుతుంది.
            లోబడింది. ఇప్పుడు జ్ఞాపకాలు వేగంగా అంటే, క్రియాశక్తి మరింత వేగంగా పనిచేస్తుంది కదా! అప్పుడు.
            అవును.
ఒక్క ఇచ్ఛాశక్తి యొక్క ప్రభావం వుంటేనే క్రియాశక్తి వేగంగా పనిచేస్తుంది. దాని కంటే క్రింద వున్న పదార్థంలోని జడశక్తి మరింత వేగంగా పనిచేస్తుంది. విజ్ఞానమయ కోశం కూడా సత్వగుణంలో వుండవలసినది, రజోగుణంలోకి లొంగినది అనుకోండి అప్పుడేమయ్యింది? జ్ఞానశక్తి కూడా రజోగుణానికి లోబడినప్పుడు, తీవ్రమైన వేగంతో పనిచేయడం మొదలు పెట్టినాయి. అప్పుడు మనోమయకోశం కూడా ఏమైపోయింది రజోగుణాన్ని విడిచిపెట్టి తమోగుణంలోకి వచ్చేసింది.
            ఒక్క సారి చెప్పండి, మళ్ళా  !
అప్పుడు దుఃఖం తీవ్రం అయ్యిందా? తగ్గిందా?
            తీవ్రం అవుతుంది. తమోగుణం.
కాబట్టి, ఈ విజ్ఞానమయకోశం సత్వగుణంలో వుంటేనేమో దుఃఖం సామాన్యంగా వుంది. విజ్ఞానమయకోశం రజోగుణానికి ఎప్పుడైతే లోబడిందో, దుఃఖం తీవ్రమైపోయింది. కాబట్టి, ఇప్పుడు దృష్టి దేనిమీద పెట్టాలి?
మనోమయ కోశం మీద పెట్టాలా? విజ్ఞానమయకోశం మీద పెట్టాలా?
            విజ్ఞానమయ కోశం మీద. పెట్టాలి.
కానీ, మనమందరం దేనిమీద పెడుతున్నాం?
            మనోమయకోశం మీద (దృష్టిని) పెడుతున్నాం.
రజోగుణ ధర్మంగా అది తీవ్రవేగంతో చలిస్తూ వుంటుంది కదా! దాని ధర్మం సృష్టిధర్మంగా చలించడం. విక్షేపం దాని ధర్మం.
కాబట్టి, ఇప్పుడు నిరసించడం అంటే ఏమిటి?
పంచకోశ విచారణ చేయడమంటే, ఒక తీరుగా చేశావు.
అవును.
ఎలా వ్యవహరిస్తున్నాయి, శరీరంలో ఇంద్రియాలు ఎలా పనిచేస్తున్నాయి, క్రియలు ఎలాపనిచేస్తున్నాయి. కర్మ ఎట్లా వుంది? ఫలితం ఎట్లా వస్తోంది, అవి జ్ఞాపకాలు ఎలా అవుతున్నాయి, వాసనలు ఎలా అవుతున్నాయి, సంస్కారాలు ఎలా అవుతున్నాయో తెలుసుకుంటే విచారణ పూర్తైపోయింది.
            అవును.
ఇప్పుడు నిరసించాలంటే, నువ్వు దేనిని ఆశ్రయించాలి? ఇచ్ఛా క్రియా జ్ఞాన శక్తులలో, ఇచ్ఛాశక్తిని, క్రియాశక్తిని విడిచిపెట్టి జ్ఞానశక్తిని ఆశ్రయించాలి.

ఈ జ్ఞానశక్తికి ఆధారం ఎవరు?
            కానీ, ఇక్కడ ఇచ్ఛాశక్తి దగ్గరకు వచ్చేటప్పటికి, మొట్టమొదట దాని వేగము తగ్గించగలిగితేనే అసలు జ్ఞానాన్ని గ్రహించగల శక్తి బుద్ధి అట్లా, బుద్ధిలో జ్ఞానం నింపుకోగల శక్తి, స్థిరత్వం అనేది వస్తుంది. సాధనా పరంగా చూస్తే, కిందనుంచి పైకి ప్రయాణం చేసేటప్పుడు, మొట్టమొదట సత్సంగం చేయడం ద్వారానో, లేకపోతే భజన చేయడం ద్వారానో, లేకపోతే కీర్తనల మీద మనసును లీనం చేయడం ద్వారానో, మనోవేగం తగ్గించగలిగితేనే అసలు జ్ఞానం పరిధికి రాగలుగుతున్నాం కానీ, అసలు బుద్ధి వరకూ కూడా రాలేం కదా! అవి చేయలేకపోతే?

ఇప్పుడు చిత్తం అనేది విజ్ఞానమయ కోశంలో వుందా? ఆనందమయ కోశంలో వుందా?
            చిత్తము ఇట్లా మామూలుగా చెప్పేటప్పుడు మనసు, చిత్తము, అహంకారము, బుద్ధిని కలిపి చెబుతున్నారు. ఒక్కోసారి చిత్తాన్ని కారణ శరీరంతో కలిపి చెబుతున్నారు కొద్దిగా confusion గా వుంది. ఆ area లో నాకు.
            అంటే వ్యవహారబేధంతో వర్తిస్తున్నప్పుడేమో మనో బుద్ధులుగా పిలువబడుతోంది. వ్యవహారం లేకుండా వున్నప్పుడేమో కారణ శరీరంగా పిలవబడుతోంది.
            అంటే బీజరూపంలో వున్నప్పుడు కారణ శరీరం.
అంటే ఆనందమయకోశం కారణ శరీరం కదా !
            అవును.
ఆనందమయ కోశం లో ఏ వృత్తులు వున్నాయి?
            గత అనుభవ జ్ఞాపకాలు వుంటాయి.
ప్రియం మోద ప్రమోదాలు వున్నాయి.
            అవును.
ప్రియం అంటే సత్వగుణం. మోదం అంటే రజోగుణం. ప్రమోదం అంటే తమోగుణం.             అంటే classification దాన్ని ఏ basis మీద చేస్తున్నారు. సత్వగుణం రజోగుణం తమోగుణమని?
ఆనంద భావంలో ఈ మూడు స్థాయీభేదములున్నాయి. వృత్తిభేదం లేదుకానీ, ఏక వృత్తిలో కలుగుతున్నటువంటి ఆనందములోనున్న స్థాయి భేదం వుంది.
            ఒకటి ఇచ్ఛారూపంలో వుంది. తరువాత అది క్రియారూపంలోకి వచ్చింది. తరువాత అనుభవంగా మారింది. దానిని మూడు గుణాలుగా ఎట్లా divide చేశారు?
అట్లా కాదు. మళ్లా పొరపాటు పడ్డావు. ఇచ్ఛా క్రియా జ్ఞాన శక్తులు అనేవి, అన్నమయ కోశం, ప్రాణమయకోశం, మనోమయకోశం, విజ్ఞానమయకోశం.
            ఇప్పుడు, ఆనందమయకోశంలో ప్రియం అంటే ఇష్ట వస్తువును చూడగానే కావాలి అని కలిగే భావన. మోదం అంటే దానిని పొందడం.
            ఆగు ఆగు. ఆలా వుండదు. అలా వుండదు.
ఆనందమయ కోశంలో ఏరకమైనటువంటి వస్తు వ్యాపారం లేదు.
            Okay.
(ఆనందమయ కోశంలో) ఏరకమైనటువంటి వృత్తి వ్యాపారము కూడా లేదు.
            Okay.
అవన్నీ (వృత్తి వ్యాపారము, వస్తువ్యాపారము) ఎందులో వున్నాయి?
            కేవలం మనోమయ, విజ్ఞానమయంలోనే వున్నాయి.
            Okay.
ఆనందమయకోశంలో ఒకే ఒక వృత్తి వున్నది, అది ఆనంద వృత్తి.
            Okay.
అయితే అది (ఆనందవృత్తి) దేనితో కూడుకుని వున్నది?
            మూడుగుణాల యొక్క మూల స్థితితో కూడుకుని యున్నది. అంటే, మూడుగుణాలు విషయంగా మారలేదు అక్కడ. కేవలం బీజరూపంలోనే వున్నాయి. బీజరూపంలో వున్నాకూడా మూడు గుణాలు వుంటాయిగా. ఆ మూడుగుణాలని ప్రియం మోదం ప్రమోదాలుగా బీజరూపంలో వున్నాయి అని నీకు గాఢనిద్రను విచారణ చేసినప్పుడు మాత్రమే తెలుస్తుంది. అంటే అర్థం ఏమిటంటే, గాఢనిద్రావస్థ నుంచి కలలోకి, కలనుంచి మెలకువలోకి దిగివస్తున్నావు కదా! రోజూ.
            అవును.
కలలోకి రావాలి అంటే, మనోమయ విజ్ఞానమయ కోశములలోకి దిగి వస్తేనే, కలలోకి వస్తావు.
            అవును.
ఆనందమయకోశంలో వున్నప్పుడు ఆదిశక్తే ఆధారంగా వున్నావు.
            Okay.
అక్కడ జ్ఞానశక్తి లేదు. కాబట్టి, గాఢ నిద్రావస్థలో ఏ నిర్ణయం చేయలేకపోతున్నావు.
            Okay.
ఇచ్ఛా క్రియా జ్ఞాన శక్తులు వ్యవహారం చేత మాత్రమే నిర్ణయించ బడుతున్నాయి. ఆదిశక్తి వద్ద వ్యవహార శూన్యం అవ్వడం వల్ల ఈ మూడూ నీకు నిర్ణయం లేకుండా పోయింది.

ఏ నిర్ణయం లేక పొయ్యింది?
            వ్యవహారం చేత ఏర్పడుతన్నటువంటి జ్ఞాన రూపక నిర్ణయం లేకుండా పోయింది. కానీ, ఆనందభావానుభవ నిర్ణయం వుందా లేదా? గాఢనిద్రావస్థలో?
            వుంది.
ఉంది కాబట్టే ప్రతిరోజూ ఆ స్థితిలోకి వెళ్తున్నారు.
            Okay.
కాబట్టి, సర్వ వ్యవహార శూన్యమైన చోటనే ఆనందమున్నది కదా! ఇప్పుడు.

            ఇప్పుడు అక్కడే ఒక doubt వస్తుంది. ఆనందం అనేది, మీరు ఆనంద భావన ఒక్కటి తప్పితే, ఆనందమయ కోశంలో ఇంక ఏ వృత్తి వుండదన్నారు. అది ఏదన్నా జ్ఞాపకం అనేది లేకుండా, అసలు వృత్తి అనేది వుండదు కదా!
            జ్ఞాపకం లేకుండా వృత్తి వుంటుందా?
చెప్తా విను.
            అంటే, వృత్తి అంటే ఏమిటి నీ వుద్దేశ్యంలో?
            ఒక wave. Thought wave లాంటిది.
వృత్తి అంటే రెండు శక్తుల మధ్య సంఘర్షణ వలన ఏర్పడుతున్నది వృత్తి. సంఘర్షణ బలం ఏర్పడాలి అంటే, ఇచ్ఛా క్రియా జ్ఞానశక్తుల మధ్య సంఘర్షణ బలం వ్యాపారం వున్నది కాబట్టి వుంది. ఆదిశక్తి వద్దకు వెళ్ళేటప్పటికి, ఈ మూడు శక్తులు కూడా ఆదిశక్తిలో లయించి పోయినాయి. లయించడం చేత ఘర్షణ బలాన్ని కోల్పోయినాయి. కాబట్టి ఏక వృత్తి మాత్రమే వున్నది. ఆనంద భావమనెడి ఏక వృత్తి మాత్రమే వున్నది. అక్కడ కేవల అనుభవ జ్ఞానం మాత్రమే వున్నది కానీ వ్యక్తీకరణ లేదు. వ్యక్తీకరణకు వృత్తి అని పేరు.

చిత్త వృత్తిఅంటున్నామే, ఆ చిత్త వృత్తికి కారణం జ్ఞాపకమనీ, వాసననీ పంచకోశ విచారణలో చెబుతాం. కానీ, పంచకోశ నిరసనకు వచ్చేటప్పటికి, ఆనందభావ నిరసన చేస్తే, ఏమైంది?
అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములు ఐదు ఒకేసారి నిరసించబడ్డాయి.
అవును.
ఎందువల్ల?
            బుద్ధి అనేది ఆనందం దృష్ట్యా నిర్ణయాలు తీసుకుంటుంది కాబట్టి.
ఆనందభావమే మిగిలిన నాలుగు కోశములలో ప్రతిబింబిస్తుంది కాబట్టి.
            అవును.
ఆదిశక్తే మిగిలిన మూడు శక్తులుగా మారుతోంది కాబట్టి.
ఆది శక్తే మూడు శక్తులుగా, మూడు కోశాలుగా వ్యవహరిస్తోంది కాబట్టి.
అసలు నిజానికి అన్నమయకోశం వ్యవహరిస్తున్నదా?
            లేదు.
కాబట్టి, వ్యవహారమంతా ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములలోనే వున్నది.
            అవును.
తన యందు తాను మాత్రమే వ్యవహరిస్తున్నప్పుడు ఆనందమయ కోశంగా వున్నాడు.
తనకు అన్యమైనటువంటి దాని యందు వ్యవహరించేటప్పుడు విజ్ఞానమయ, మనోమయ, ప్రాణమయ కోశాలుగా అయ్యాడు. తనయందు తాను వ్యవహరించునది బింబ వ్యవహారముగానూ, తనకు అన్యమైన దాని యందు వ్యవహరించేది ప్రతిబింబవ్యవహారముగానూ వ్యవహారాన్ని రెండు భాగములుగా విభజించాం. తనయందు తానే రమించుట చేత ఆనంద భావంలో మూడు స్థాయిలు ఏర్పడుతున్నాయి. ప్రియం మోద ప్రమోదములు.
            ప్రియం అనే స్థాయిలో ఆనంద భావానికి సాక్షిగా వున్నాడు. ప్రమోద స్థాయిలో అనందమే తానుగా వున్నాడు. మోద స్థాయిలో విచారణ చేయలేని దశలో వున్నాడు. ఇప్పుడు క్రింది కోశాలలోకి దిగిరావాలి అంటే ప్రమోదం నుంచి దిగి వస్తున్నాడు.  అదే ప్రియం అనే స్థాయిలో వున్నట్లయితే, ఆనంద భావానికి సాక్షిగా వున్నాడు. ఇప్పుడు సాక్షిగా వున్నప్పుడు, విశ్వజనీనమైనటువంటి సమిష్టియందు, సమత్వ భావం కలిగినటు వంటి ప్రేమను కలిగి వున్నాడు. మోద స్థాయికి వచ్చేటప్పటికి, వ్యష్టి భావన ఏర్పడిపోయింది. జీవభావం అంకురించేసింది. జీవభావం చేత పరిమితమై, తానూ తనవారిని ఆశ్రయించాలనే తలంపు అంకురించింది. దానికి బలమైన అనుభవం మోద స్థాయిలో లభించక, ప్రమోద స్థాయికి తమోగుణానికి దిగింది. దిగడం చేత ఇతర కోశముల యొక్క సహాయం అవసరమైంది. ప్రియం అనే స్థాయిలోనే వున్నప్పుడు, కిందకు దిగిరావలసిన అగ్యతం ఏర్పడలేదు. కాబట్టి, ప్రమోదం అనే తమోగుణ స్థాయినుంచి మిగిలిన మూడు కోశాలలోకి ఆదిశక్తి దిగి వస్తున్నది. కోశ వ్యవహార పరిధిని బట్టి, స్థితిని బట్టి, శక్తులకు పేర్లు పెట్టబడ్డాయి.

తామసిక వ్యవహారంతో వున్నప్పుడు క్రియాశక్తి అని,
రాజసిక వ్యవహారంతో వున్నప్పుడు ఇచ్ఛాశక్తి అని,
సాత్విక వ్యవహారంలో వున్నప్పుడు జ్ఞానశక్తి అని వ్యవహరించబడుతున్నాయి.

క్రియాశక్తి ప్రాణమయకోశంలోనూ, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తలు మనోమయ, విజ్ఞానమయ కోశంలోనూ వ్యవహరిస్తూ వున్నాయి. వ్యవహారమునంతటికీ నేను సాక్షిని అయివున్నప్పుడు, ఈ మూడు కోశములు నేను కాదు. ఈ మూడు కోశములందలి వ్యవహారము ఎవరి వ్యవహారము?
            ఈ మూడు కోశముల వ్యవహారము, ఆనందమయ కోశం నుండి దిగివస్తేనే కదా! ఈ మూడు కోశములతో వ్యవహారము?
            కాబట్టి, ఆనందమయ కోశం నుంచి దిగివస్తున్నటువంటి ఆదిశక్తి యొక్క వ్యవహారముగా నిన్ను పరిగణించాడు.
అవును.
తన వ్యవహారముగా పరిగణించలేదు.
నేను ఇచ్ఛా, క్రియా, జ్ఞానశక్తులతోటి వ్యవహరించటం లేదు. నేను ఆనందభావానికి సాక్షిని. సృష్టి ధర్మం ప్రకారం, సృష్టి ప్రవాహ వేగం ప్రకారం, సృష్టి నియతి మేరకు, ఆదిశక్తి అనేటువంటి చైతన్యం, జడచేతన ఘర్షణ బలాల చేత, ఇచ్ఛా క్రియా జ్ఞాన శక్తులుగా పరిణామం చెందుతూ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలలో ప్రయాణం చేసి, ప్రాణమయకోశంలోకి జడశక్తి అయినటువంటి అన్నమయకోశంలోకి ప్రవేశించి, తాత్కాలికమైనటువంటి  వ్యవహార నిర్ణయం చేస్తున్నది.
            ఈ తాత్కాలిక వ్యవహారమంతా, ఇచ్ఛా క్రియా జ్ఞాన శక్తుల వ్యవహారమే కానీ, నా వ్యవహారము కాదు. ఆనంద భావం కూడా ఆదిశక్తి యొక్క అనుభవజ్ఞానమే కానీ, నాది కాదు. అని ఈ సర్వ సమిష్టిని సర్వ వ్యష్టిని ఒకే సమన్వయంతో చూడగలిగినప్పుడు, వ్యష్టి వ్యవహారమైనటువంటి, అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయములలో ఏర్పడుతున్నటువంటి అనుభవజ్ఞానమునకు సంబంధించిన జ్ఞాపకాల మొత్తము, సాక్షిత్వ జ్ఞానము వద్ద దగ్ధం అయిపోయినాయి. ఏ సాధకుడైతే ఆనంద భావానికి సాక్షిగా వున్నటువంటి స్థానంలో స్థితిలో మూడవస్థలయందు తురీయస్థితిలో వుంటాడో, అతనియందు జ్ఞానాగ్ని మేల్కొంటుంది.
            ఒక అవస్థకి సాక్షిత్వము మిగిలిన రెండవస్థలకు సాక్షిత్వము ఎట్లా?
ఈ శక్తుల యొక్క వ్యవహారముగా చూడగలగాలి ఆ రెండింటిని.
            ఒక స్థితిలో మామూలుగా మెలకువలో చూడగలుగుతాము. స్వప్నంలో సుషుప్తిలో కూడా అట్లా సాక్షిత్వంగా వుండడం అంటే అది, మన ప్రమేయం లేకుండానే జరుగుతున్నవి కదా అవి.
మెలకువలో ఏ శక్తి యొక్క వ్యవహారము వున్నది?
            ఆదిశక్తి యొక్క వ్యవహారము వున్నది.
మెలకువలో నీకు ఇచ్ఛా క్రియా జ్ఞానశక్తుల యొక్క మూడింటి వ్యవహారము వున్నది.
అవును.
స్వప్నంలో? (ఏ శక్తి యొక్క వ్యవహారము వున్నది?)
            ఇచ్ఛాశక్తి యొక్క వ్యవహారము ఒక్కటే వున్నది.
            ఇచ్ఛాశక్తుల యొక్క వ్యవహారము వున్నది.
గాఢనిద్రావస్థలో? (ఏ శక్తి యొక్క వ్యవహారము వున్నది?)
ఆదిశక్తి వ్యవహారము ఒక్కటే వున్నది. కాబట్టి, క్రియా జ్ఞాన శక్తులు లేవు అక్కడ. అవును.
ఇచ్ఛాశక్తి కూడా లోపించింది.
            అవును.
ఈ మూడు ఆదిశక్తిలో లయం అయిపోయినాయి.
            అవును.
కాబట్టి, కేవలం ఆనందభావం మాత్రమే గాఢనిద్రావస్థ యందు జీవుడు అనుభవిస్తున్నాడు. ఇది జీవుడు అనుభవించేటటువంటి తాత్కాలికమైనటువంటి విషయానందమే తప్ప,
            ఇక్కడ ఇంకొక్క doubt వస్తుంది.
            జీవుడికి వచ్చేటప్పటికి బుద్ధి విజ్ఞానమయకోశాన్నే జీవుడు అంటున్నారు కదా! మరి ఆనందమయకోశంలో కూడా జీవుడియొక్క అనుభవం అంటున్నారేంటి?

ఎందుకనంటే, ఈ విజ్ఞానమయకోశం దేనిమీద ఆధారపడి పనిచేస్తుంది?
ఆనందమయకోశం మీద.
అంటే ఆనందభావమనే ఆధారమే లేకపోతే, కింద వున్న కోశాలు ఏవీ పనిచేయలేవు.             అవును.
ఇప్పుడు ఆనంద భావాన్ని జీవుడనాలా? విజ్ఞానమయ కోశంలో తాత్కాలిక వ్యవహారాన్ని పొందుతున్నటువంటి జ్ఞానశక్తిని జీవుడనాలా?
ఆనందభావాన్ని పొందుతున్నవాడినే జీవుడనాలి. కానీ నీ విచారణ మెలకువ వరే పరిమితమై వున్నప్పుడు, విజ్ఞానమయ కోశాన్నే జీవుడు అనవలసి వచ్చింది. నీవు గాఢనిద్రావస్థను కూడా విచారణ చేయగలిగేంత, సూక్ష్మతమమైన స్థితిలోకి మార్పు చెందినప్పుడు, ఆనందభావమే జీవుడైంది.
            కాబట్టి, ఆనందభావానికి సాక్షి ఎవడో, అతడు ఆత్మ స్వరూపుడైయున్నాడు. సర్వవ్యాపక ప్రకాశమై యున్నాడు. తురీయస్థితి యందు వున్నవాడు. ఇట్టి తురీయ స్థితియందు, ఎవరైతే వున్నారో, వారికి జ్ఞానాగ్ని ప్రాప్తిస్తుంది.
            జ్ఞానాగ్ని ప్రాప్తించిన తరువాత, ఈ పంచకోశ వ్యవహారములలో వున్నటు వంటి, ఇచ్ఛా క్రియా జ్ఞాన ఆది శక్తి యొక్క వ్యవహారం అంతా కూడా, ఏ ఏ సంస్కారములతో ఏ ఏ జ్ఞాపకములతో, ఏ ఏ గుణ బలములతో, కూడుకుని వ్యవహరిస్తూ వున్నదో, సృష్టి ధర్మం మేరకు, ఆ సర్వమూ కూడా, సాక్షిత్వ జ్ఞానం దృష్ట్యా చూడబడి, ఆ సాక్షిత్వ జ్ఞానంలో దగ్ధం అయిపోయినాయి.
 దగ్ధం అయిపోయినాయి అని ఎందుకు అంటున్నారంటే, ఆ నాలుగు శక్తుల యొక్క వ్యవహారము మరలా తోచినప్పుడు, ప్రారబ్దబలంచేత గానీ, సృష్టి వ్యవహారం చేతగానీ తోచినప్పుడు, అతడు వాటి యెడల స్పందన లేక వుంటాడు. ఎప్పుడైతే స్పందన లేక వున్నాడో, ఈ సృష్టి ధర్మం ప్రకారం ఎవరైతే స్పందించరో వారిని ఏదీ ఆశ్రయించదు. ఎందుకనిట?
అక్కడ స్పందన లేక వుండేదేమిటి?
సాక్షి.
            అంటే?
నిష్క్రియం.
            స్పందన లేకుండా వుండటం కూడా ఒక క్రియే కదా!
నిష్క్రియం కూడా ఒక క్రియే కదా?
కాదు కాదు కాదు.
క్రియ అంటే వ్యవహరించడం.
సాక్షి అంటే ఉండటం.
            ఉంటున్నవాడు ఒకడున్నాడు కదా!
వాడు లేడక్కడ.
అక్కడ వ్యష్టి చేరినప్పుడే, జీవభావం చేరినప్పుడే డు వస్తుంది. సాక్షి వున్నది.
ఆకాశం వున్నదా? ఆకాశం వున్నాడా?
ఆకాశం వున్నది.
ఎందుకు?
            ఉండటమే దాని పని.
ఆకాశానికి వ్యవహారం వుందా?
            లేదు.
మిగిలిన నాల్గిటికి?
            ఉంది వ్యవహారం.
అది. అలాగే...
            కానీ, వ్యవహారం తెలుసుకోలేనంత సూక్ష్మంగా వుందని కూడా అనవచ్చును కదా! ముందు ఇక్కడి దశవరకు ముందు వెళ్ళాలి నువ్వు.
మెలకువకు సాక్షి వుండడానికి ప్రయత్నం చేసేవాడు, ఆకాశానికి అవతల వున్న సాక్షిని పట్టుకోవడం అప్పుడే కుదరదు. అర్థమైందా?
            సరే!
ముందు ఎలా వెళ్ళాలయ్యా అంటే, ముందు ఈ పంచకోశ వ్యవహారమంతా, ఇచ్ఛా క్రియాశక్తి జ్ఞానశక్తి ఆదిశక్తి వ్యవహారమే కానీ, నా వ్యవహారం కాదు. అని నువ్వు నిరసించుకోగలగాలి. ఇదంతా సమిష్టి సృష్టి ప్రవాహంలో భాగంగా జరుగుతున్నదే కానీ, నా యెక్క ప్రత్యేకమైనటువంటి కర్తృత్వ బాధ్యత ఇందులో ఏమీ లేదు. కర్త లేనప్పుడే కదా సాక్షి మిగిలేది. అంటే భోక్తృత్వ రహిత విధానాన్ని ఆశ్రయించినప్పుడు మెలకువకు మాత్రమే సాక్షివి అవుతావు

మెలకువలో కర్త లేకుండా చేయడం అనే పద్ధతిని ఆశ్రయించినప్పుడు మాత్రమే కలకి నిద్రకీ కూడా సాక్షివి అవుతావు. అంటే కర్తృత్వ రహిత కర్మాచరణను స్వీకరించాలి.


నిష్కామ కర్మ అంటే అర్థం ఏమిటి? నిష్కామ కర్మ అంటే ఏమిటి?
ఏ కోరికా లేకుండా జరుగుతన్నది జరగనిస్తూ వుండటం. కర్మయొక్క ఫలితాన్ని ఆశ్రయించకుండా, కోరకుండా వుండటం.
కోరిక అంటే అర్థం అది.
మనం ఎప్పడైతే కోరి involve అవుతామో automatic గా ప్రతిఫలం ఆశించడం వుంటుంది. అది ప్రారబ్దవశాన జరుగుతుంది అన్నప్పుడు మనం, అంటే దాంట్లో involve అవ్వనప్పుడు కర్తృత్వం లేనప్పుడు కోరిక వుండదు.

అసంగంగా వుండడం అని అక్కడ చెబుతున్నావ్‌.
            అవును.
కానీ, సంకల్పం వున్నంతవరకూ నీకు సంగత్వం తప్పదు.
            సంకల్పం అది, మరి వాసన క్రియా రూపం ధరిస్తున్నప్పుడు, ధరించవన్నీ అట్లాగే రద్దవుతుంది, చెయ్యాలి గానీ దానికి సాక్షిగా వుండాలని చెబుతున్నారు కదా!

ఏ దశలో చెప్పారు?
            ఏమో, మీరే చెప్పాలి అది.
ఏ దశలో చెప్పారంటే, అది పంచకోశ విచారణ స్థాయి. వ్యష్టిని పూర్తిగా పోగొట్టుకుని, కేవల సమిష్టి మాత్రమే మిగిలిపోయేటటువంటి బ్రహ్మానుసంధానం చేసేటువంటి దశలో ప్రాణమనస్సుల యొక్క శక్తులన్నీ వెనక్కు తీసుకోబడి హృదయ స్థానంలో వున్నటు వంటి చైతన్యంలో ఏర్పడుతున్న కదలికల పేర్లే సంకల్పాలు. చైతన్య స్థితిలో ఏర్పడుతున్నటు వంటి కదలికలైనటువంటి సంకల్పాల యొక్క వ్యవహారమే, ఇచ్ఛా, క్రియా, జ్ఞాన, ఆది శక్తులు. కాబట్టి సంకల్ప సాక్షి అయిన వాడు ఎవడో వాడు పరాశక్తికి ఆధారంగా వున్నటువంటి సదాశివస్వరూపం. అతడే బ్రహ్మము. కాబట్టి, ఆదిశక్తి స్థానం నుంచి పరాశక్తి స్థానానికి ఎవరైతే లక్ష్యాన్ని పెట్టుకుంటారో, వాళ్ళు మాత్రమే ఆనంద భావానికి సాక్షి అవ్వగలుగుతారు, జీవన్ముక్తి అయినటువంటి తురీయభావాన్ని పొందగలుగుతారు. 
            అంటే, ఇప్పుడు నిష్కామ కర్మ దగ్గర ఆగినట్లు వున్నాం. ఒక్క సారి అది clear చేయండి. కాబట్టి నిష్కామ కర్మ అంటే అపేక్ష లేకుండా కర్మ చేయడమనేది భోక్త లేకుండా చేయడానికి పనికి వస్తుంది. అమనస్క పద్ధతిని ఆశ్రయించినప్పుడు మాత్రమే, నీవు సదాశివభావాన్ని పొందగలుగుతావు. కాబట్టి, భోక్త రహిత పద్ధతినేమో నిష్కామ కర్మగా, అమనస్క పద్ధతికి ఆధారంగా మొదటి స్థితిలో సదాశివ స్థితిని చెబుతారన్నమాట.

 కాబట్టి అమనస్క పద్ధతి ఎక్కడినుంచి ప్రారంభం అవుతుంది?
            సదాశివస్థితి యొక్క అనుభవంతో ప్రారంభం అవుతుంది. అంటే బ్రహ్మానుసంధానం. బ్రహ్మమే తాను. అహం బ్రహ్మాస్మి అనేటటువంటి నాలుగు మహావాక్యాలలో వున్నటు వంటి అహం బ్రహ్మాస్మితో ప్రారంభమై, అచలంతో పూర్తైపోతుంది అమనస్కం.
అదే నిష్కామ కర్మ, జీవభావం నుంచి నిన్ను విడుదల చేసి, నీవు ఆత్మ స్వరూపుడని, బ్రహ్మానుసంధానం చేయడానికి కావలసిన ఆత్మానుభవాన్ని ఇస్తుంది. కాబట్టి, ఈ పంచకోశ విచారణ చేసేటటువంటి వాళ్ళేమో, ఆత్మ విచారణ అనే దృష్టికోణంలో వ్యవహరిస్తూ, సత్వగుణాశ్రయంగా వుండి, సాత్వికమైనటు వంటి సమత్వంతో, ఆగిపోతారు. కాబట్టి సత్వగుణం కూడా నేను కాదని, సత్వగుణాన్ని నిరసించేటప్పుడు పంచకోశనిరసనను స్వీకరించవలసి వస్తుంది. అప్పుడు మాత్రమే మూడుగుణాలు నిరసించబడి, నువ్వు మూడవస్థలకి మూడు గుణాలకి, నాలుగు శక్తులకు సాక్షిగా వుంటావు. సత్వగుణాన్ని నిరసించకపోతే ఎప్పటికీ కూడానూ కలకి, నిద్రకినూ అవతలకి వెళ్ళేటటువంటి దశలోకి, సాక్షిత్వంలోకి చేరలేవు.
            ఇది చెప్పారు, దీనిని అనుభవంలోకి తెచ్చుకునే విధానం ఏమిటి?
రోజువారీ నిజజీవితంలో జీవించేటప్పుడు భోక్త రహితంగా జీవిస్తున్నావా? కర్తృత్వ రహితంగా జీవిస్తున్నావా? చూసుకో!
చేసేటటువంటి వాడు వున్నంతవరకూ ఏదో ఒకకాలంలో అనుభవించేవాడు వస్తాడు. జ్ఞాపకాలు మూట కట్టడం అనేది తప్పనిసరిగా జరుగుతుంది. అంతర్లీనంగా. రోజూ నీకు మూడవస్థలు ఏర్పడుతూ వున్నప్పుడు ఆ మూడవస్థలన్నీ కూడా ఇచ్ఛా, క్రియా, జ్ఞానశక్తి, ఆదిశక్తి యెక్క వ్యవహార పద్ధతిగా చూడటం గమనించాలి. మెలకువలో ఏం చేసినా కానీ ఈ నాలుగు శక్తులను గుర్తించాలి. కలలో ఏం జరుగుతున్నా కూడా ఆ నాలుగు శక్తులనే గుర్తించాలి. గాఢనిద్రావస్థలో కేవల ఆనందభావ వృత్తిని మాత్రమే గుర్తిస్తూ, అక్కడ వున్నటువంటి ఆదిశక్తి వ్యవహారంగా గుర్తించాలి.
            సమిష్టి సిద్ధాంతం అయినటువంటి, జీవుల అందరి యందు వ్యాపించి వున్నటువంటి, ఈ శక్తి వ్యవహార సూత్రాన్ని తెలుసుకుని, ఈ శక్తులకు సాక్షి అయినటువంటి, బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వర సదాశివులనేటటువంటి ప్రత్యగాత్మ పద్ధతిని స్వీకరించాలి.
సాక్షి పేరు ఇక్కడ ప్రత్యగాత్మ. కాబట్టి ఇచ్ఛాశక్తితో వ్యవహరిస్తున్నప్పుడేమో, ఎలా వున్నావు? బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వర సదాశివులు. నాలుగు శక్తులతో కూడా. అర్థమైందా? పంచ బ్రహ్మలు, పంచ శక్తులు. బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వర సదాశివులు. పంచబ్రహ్మలు. ఈ పంచ బ్రహ్మలను ఆధారంగా చేసుకుని వ్యవహరిస్తున్నటువంటి శక్తులు ఇచ్ఛా క్రియా జ్ఞాన ఆది పరాశక్తులు. కాబట్టి అనంత సృష్టియందంతా వ్యవహరిస్తున్న ఇచ్ఛా క్రియా జ్ఞాన శక్తులు అన్నట్లయితే వాటికి ఆధారమైనటు వంటి ప్రత్యగాత్మ అక్కడ ఎలా వున్నాడు? బ్రహ్మ విష్ణు రుద్రులగా వున్నారు. కాబట్టి ఇట్లా ఆది దైవిక వ్యవహారంగా జీవవ్యవహారాన్ని గమనించి నప్పుడు, జీవభావాన్ని కోల్పోయి దివ్యభావాన్ని పొందుతున్నావు.
           
ఈ దైవీ భావంతో నువ్వు ఎప్పుడైతే సమస్త వ్యవహార శూన్యస్థితిలోకి నీవు చేరతావో, అప్పుడే నీవు బ్రహ్మాను సంధానాన్ని చేయగలిగే సాక్షిత్వాన్ని పొందుతావు. కాబట్టి మెలకువలో ఏది వ్యవహరిస్తున్నా కూడా ఆ వ్యవహారం అంతా ఎవరి వ్యవహారంగా చూడాలిప్పుడు? ఇచ్ఛా క్రియా జ్ఞాన ఆది శక్తి యొక్క వ్యవహారంగా గమనిస్తూ, నీవు సాక్షి అయినటువంటి బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వర సదాశివులనేటటువంటి జ్ఞప్తిలో నిలబెట్టుకోవాలి.

            ఆ పంచబ్రహ్మలుగా వ్యవహరిస్తున్నది ప్రత్యగాత్మయే. ఒక్క ప్రత్యగాత్మయే వ్యవహార భేదం చేత పంచబ్రహ్మలుగా నిర్ణయించబడుతున్నది. అనే సత్యాన్ని నువ్వు తురీయానుభవంలో పొందుతావు. సర్వవ్యాపక ప్రకాశమే నేను అనే అనుభవాన్ని పొందగానే, ఆ శక్తి కలుగుతుంది. దానికి వ్యవహార శూన్యత వుంటుంది. అది క్రమేపి అలా వుండగా వుండగా సంకల్ప శూన్యత్వస్థితిని పొందుతుంది. సంకల్ప శూన్యత్వస్థితిని పొందినప్పుడు చైతన్యం స్వాధీనం అవుతుంది. అప్పుడు వ్యష్టి పూర్తిగా లేకుండా పోయి, కేవలం సమిష్టి మాత్రమే మిగిలిపోతావు. ఇలా ఈ లక్ష్యంతో ముందు ప్రయాణం చేయి.
           
పంచకోశాలని మళ్ళా మూడు శరీరాలుగా ఎందుకు విడగొట్టారు?
            అట్లా తెలిస్తేనే నీకు, శక్తి వ్యవహారం తెలుస్తుంది కాబట్టి. అన్ని త్రిపుటులుగా వున్నది కూడా నిరసించటం రావాలి.

మూడు గుణాలు, మూడు అవస్థలు, మూడు శరీరాలు, నువ్వు ఏ రకమైన మూడు మూడుగా చెప్పినవన్నీ కూడాను, ఈ పంచశక్తుల యొక్క వ్యవహారమే అనేటు వంటి దృష్టికోణంలోనుంచి నువ్వు గమనించడం రావాలి. అప్పుడు మాత్రమే దానిని నిరసించుకో గలుగుతావు. అర్థమైందా? సాయిరాం.

Download Mp3 [23mb]
Note: పై వ్యాసం ప్రూఫ్‌ రీడింగ్‌ పూర్తి కానందున అక్షర దోషాలు, వాక్య నిర్మాణ, వ్యాకరణ దోషాలు చాలా వుండవచ్చును. విజ్ఞులు దోషములెంచక సారంశము గ్రోలెదరని మనవి చేయడమైనది.
ఓం తత్‌ సత్‌